హన్మకొండ: కలెక్టర్ ప్రత్యేక నిధులతో ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణం
హన్మకొండ జిల్లా ఐనవోలు కక్కిరాలపల్లి గ్రామంలో రెండు లక్షల రూపాయల కలెక్టర్ ప్రత్యేక నిధులతో ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టారు. ఈ సందర్భంగా పనులను మంగళవారం ఐనవోలు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సమ్మట మహేందర్ పరిశీలించారు. ఈ నేపథ్యంలోనే మహేందర్ మాట్లాడుతూ పిల్లలకు ఎలాంటి లోటు లేకుండా త్వరగా మరుగుదొడ్లను పూర్తి చేయాలని గుత్తేదారులను సూచించారు.