ఎలాంటి కారణం లేకుండా భార్యాభర్తలు ఒకరికొకరు దూరంగా ఉన్నప్పుడు అతను/ఆమె కాపురానికి రావాలని హిందూ వివాహ చట్టం-1955లోని సెక్షన్ 9 కింద జిల్లా కోర్టులో ఫిర్యాదు చేయొచ్చు. భాగస్వామి తనతో శారీరకంగా, మానసికంగా కలిసి జీవించేలా కోర్టు నుంచి ఆదేశాలు పొందవచ్చు. అయితే దీనికోసం తాము విడిపోవడానికి చట్టపరంగా సరైన కారణం లేదని ఫిర్యాదుదారు నిరూపించాలి. వివాహ బంధం తెగిపోకూడదనే ఉద్దేశంతో ఈ చట్టాన్ని రూపొందించారు.