జనగామ మండలం చౌడారం అంగన్వాడి కేంద్రంలో అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడి టీచర్ రేణుక పౌష్టికాహారం పట్ల అవగాహన కల్పించారు. చేతులను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వివరించారు. ఈకార్యక్రమంలో గ్రామ కార్యదర్శి కన్న రాజు, రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు, అంగన్వాడీ టీచర్ జగదాంబ, ఏఎన్ఎం వసంత, ఆశా వర్కర్ స్వరూప, గర్భిణీలు, బాలికలు, గ్రామస్తులు పాల్గొన్నారు.