ఎండిన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలి

81చూసినవారు
ఎండిన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలి
జనగాం జిల్లాలో రైతుల ఎండిపోయిన వరి పంటకు వెంటనే నష్టపరిహారం అందించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. గురువారం బచ్చన్నపేట సిపిఎం పార్టీ కార్యాలయంలో మండల కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో యాసంగి పంటలు నీరందక ఎండిపోయాయన్నారు. ఈ సమావేశంలో వెంకటేష్, విజేందర్, అశోక్, బలరాం, రాములు, నర్సింహులు, బాలరాజు, నర్సింహులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్