జనగామ జిల్లా కేంద్రంలోని పలు కాలనీల్లో భోగి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. సోమవారం తెల్లవారుజామునే భోగి మంటలు వేసిన కాలనీ వాసులందరు చిన్న, పెద్ద తేడా లేకుండా బోగి మంటల చుట్టూ డ్యాన్స్ లు చేస్తూ సందడి చేశారు. పాత వస్తువులు భోగి మంటల్లో వేసి కొత్త ఆశలతో ముందుకు సాగాలని పండుగ జరుపుకున్నారు. ఇతర ప్రాంతాల నుండి వచ్చిన బంధువులతో ఇండ్లు కళకళలాడుతున్నాయి.