బిల్డింగ్ పైనుంచి కిందపడిన గురుకుల విద్యార్థిని?

70చూసినవారు
బిల్డింగ్ పైనుంచి కిందపడిన గురుకుల విద్యార్థిని?
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలోని గిరిజన బాలికల గురుకుల కళాశాలలోని ఓ విద్యార్థిని బిల్డింగ్ పైనుంచి పడిపోయింది. తీవ్ర గాయాల పాలైన విద్యార్థినిని ప్రిన్సిపల్ హుటాహుటిన ఖమ్మంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. గిరిజన బాలికల గురుకులంలో తొమ్మిదవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని గత వారం రోజుల క్రితం ఇంటికి వెళ్ళింది. తిరిగి బుధవారం నాడు హాస్టల్లో చేరింది. అదే రోజు సాయంత్రం సుమారు నాలుగు గంటల ప్రాంతంలో గిరిజన బాలికల గురుకులంలోని ఒకటవ అంతస్తు పై నుండి కింద పడింది. ప్రమాదవశాత్తు కింద పడిందా లేక.? భవనం పైనుంచి దూకిందా అనే వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్