మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ గంగారం మండలాల్లో బుధవారం ఉదయం విపరీతంగా మంచు కురుస్తుంది. ఉదయం 8 గంటలు అయినా తగ్గని మంచు ప్రభావం తో దగ్గరకు వచ్చేవరకు కనిపించడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అస్తమ పేషెంట్లు బయటికి వెళ్లవద్దని డాక్టర్లు తెలిపారు. వాహనాలకు లైట్లు వేసి నడపాలని మూలమలుపుల వద్ద తప్పకుండా హారన్ కొట్టాలని డ్రైవర్లకు పోలీసులు సూచిస్తున్నారు.