మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గాయత్రి దేవాలయంలో మంగళవారం ఘనంగా నాగుల చవితి వేడుకలు జరుపుకున్నారు. పెద్ద ఎత్తున ఆలయానికి తరలి వచ్చిన మహిళలు నాగేంద్ర స్వామికి పాలు, పూలు పంచామృతాలు సమర్పించి, భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. తెల్లవారుజాము నుండే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వారి మొక్కులు తీర్చుకుంటున్నారని ఆలయ పూజారి తెలిపారు.