తాడ్వాయిలో నిందితుడిని కఠినంగా శిక్షించాలని బంద్

85చూసినవారు
తాడ్వాయిలో నిందితుడిని కఠినంగా శిక్షించాలని బంద్
ఆదిలాబాద్ జిల్లా జైనూరు మండలంలో ఆదివాసీ మహిళపై అత్యాచారం చేసిన షేక్ ముగ్ధంను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో శనివారం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన బంద్ విజయవంతం అయ్యింది. ఈ సందర్భంగా ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో కిరాణా షాపులు బంద్ చేసి నిరసన తెలిపారు. నిందితుడిని శిక్షించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్