ఏటూరునాగారం: గుంతల మయంగా ప్రధాన రహదారి

56చూసినవారు
ములుగు జిల్లా లో ఏటూరునాగారం, మంగపేట ప్రధాన రహదారి గుంతల మయంగా మారింది. నిత్యం తిరిగే వందలాది వాహనాలతో రోడ్డు మొత్తం ధ్వంసం అయింది. జీడివాగు లోలెవెల్ వంతెనపై ఇనుప చువ్వలు బయటపడి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల కొందరు గాయాల పాలయ్యారు. మంత్రి సీతక్క స్పందించి హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు కేటాయించాలని ప్రయాణికులుకోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్