కళాశాల ముందు మెడికల్ వేస్టేజి: తొలగించాలని డిమాండ్

58చూసినవారు
ములుగు జిల్లా ఏటూరునాగారంలోని ప్రభుత్వ ఆసుపత్రి పక్కన ఉన్న కళాశాల ముందు ఆసుపత్రిలో వినియోగించిన మెడికల్ వేస్టేజి పడేయడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. టెస్టుల కోసం ఉపయోగించిన కిట్లు, సెలైన్ బాటిళ్లు, కళాశాల ముందు, ప్రధాన రహదారిపై విచ్చలవిడిగా పడేయడంతో ఇతరులకు వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని వాపోతున్నారు. వెంటనే సంబంధిత ఆసుపత్రి సిబ్బంది, గ్రామ పంచాయతీ అధికారులు తొలగించాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్