తాడ్వాయిలో తప్పిన రోడ్డు ప్రమాదం

70చూసినవారు
తాడ్వాయిలో తప్పిన రోడ్డు ప్రమాదం
ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. తాడ్వాయి మండల కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలో ఇసుక లోడుతో వెళుతున్న ఓ లారీ అదుపుతప్పి జాతీయ రహదారి మధ్యలో డివైడర్లను 500 మీటర్లు ఢీ కొట్టుకుంటూ మసీదు సమీపంలో రోడ్డు పక్కన పడిపోయింది. ఈ ప్రమాద సమయంలో రోడ్డుపై ఎదురుగా ఇతర వాహనాలు, ప్రజలు ఎవరు లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్