ఎస్సీల సంక్షేమానికి అధిక నిధులు కేటాయించాలి: సుధాకర్

57చూసినవారు
ఎస్సీల సంక్షేమానికి అధిక నిధులు కేటాయించాలి: సుధాకర్
అటవీ ప్రాంతమైన ములుగు జిల్లాలో ఎస్సీల సంక్షేమానికి అధిక నిధులు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు దాసరి సుధాకర్ కోరారు. అధిక నిధులు కేటాయించాలని కోరుతూ ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ ప్రీతంకు సుధాకర్ వినతిపత్రం అందజేశారు. అనంతరం ములుగు ప్రాంతంలో ఎస్సీలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రీతంకు సుధాకర్ వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్