ములుగు జిల్లా కలెక్టరేట్ లో జిల్లాలోని మిల్లర్లతో ధాన్యం సేకరణపై పౌరసరఫల శాఖ సంయుక్త కమిషనర్ మోహన్ కుమార్ రాథోడ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మిల్లుకు వచ్చిన ధాన్యం ఎఫ్ఏక్యూ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉందో లేదో పరిశీలించిన తర్వాత ఎలాంటి కోత విధించకుండా దిగుమతి చేసుకోవాలని మిల్లర్లకు సూచించారు. అవకతవకలకు పాల్పడే మిల్లులను రద్దు చేస్తామన్నారు.