వైభవంగా ప్రారంభమైన ముయ్యాలమ్మ జాతర

51చూసినవారు
ములుగు జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి గ్రామంలో ముయ్యాలమ్మ జాతర అంగరంగ వైభవంగా జరిగింది. ముయ్యాలమ్మ జాతరను గొంది వంశీయులు వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గ్రామ సమీపంలోని గుట్ట నుండి ముయ్యాలమ్మ దేవతను గ్రామంలోకి శుక్రవారం తీసుకు వచ్చి ప్రతిష్ఠించారు. ఈ క్రమంలో భక్తులు అక్కడికి చేరుకొని అమ్మవారికి ఎదురెళ్లి వరం పట్టారు. అనంతరం శనివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్