యువకులను రక్షించిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది

52చూసినవారు
వాగులో చిక్కుకున్న ఇద్దరిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించిన ఘటన ములుగు జిల్లా మంగపేట మండలంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం. కమలాపురంలోని రేగులగూడెం అడవిలోకి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఎర్రవాగు ప్రవాహం పెరిగింది. దీంతో రీసన్, దినేష్ అనే ఇద్దరు యువకులు వాగులో చిక్కుకున్నారు. స్థానికుల ద్వారా సమాచారంఅందుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు వారిని రక్షించారు. అనంతరం వారి తల్లిదండ్రులకు అప్పగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్