దొడ్ల మల్యాల వద్ద బారికేడ్లను ఏర్పాటు చేసిన అధికారులు

69చూసినవారు
ఏటూరునాగారం మండలం దొడ్ల- మల్యాల మధ్య జంపన్నవాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది. దీంతో అటువైపు వెళ్లొద్దని రెవెన్యూ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం బారికేడ్లను అధికారులు ఏర్పాటు చేశారు. మల్యాల, కొండాయి, గోవిందరాజుకాలనీ, ఐలాపురం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు వాగు దాటే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదాలు జరగకుండా బారికేడ్లను అధికారులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్