భద్రాచలం దగ్గర గోదావరి ఉధృతి మరింత పెరిగింది. ప్రస్తుతం 44 అడుగులకు గోదావరి నీటిమట్టం చేరింది. ధవళేశ్వరం ఇనో, ఔట్ 6.61లక్షల క్యూసెక్కులుగా ఉంది. దీంతో ఏపీలోని ఆరు జిల్లాల అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నందున గోదావరి నీటిమట్టం పెరిగే అవకాశం ఉన్నది. కాగా, 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక, 53 అడుగులకు నీటి మట్టం చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు.