గుండెపోటుతో సమ్మక్క పూజారి మృతి

32437చూసినవారు
గుండెపోటుతో సమ్మక్క పూజారి మృతి
తాడ్వాయి మండలం మేడారంలో విషాదం జరిగింది. సమ్మక్క పూజారి సిద్దబోయిన దశరథం(37) గుండెపోటుతో మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. మంగళవారం తెల్లవారుజామున దశరథం నిద్రలో నుండి లేవకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు స్థానిక వైద్యులను పిలిపించి చూపించారు. అప్పటికే గుండెపోటుతో మృతిచెందాడని నిర్ధారించారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ముగిసిన వెంటనే పూజారి మృతి చెందడంతో విషాదం నెలకొంది.

ట్యాగ్స్ :