ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి

61చూసినవారు
ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి
ములుగు జిల్లా కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆత్మీయ సమ్మేళనాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మురారి బిక్షపతి హాజరై మాట్లాడారు. ఉద్యమ కారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలుచేయాలని, ఉద్యమకారుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి వారి కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్