ములుగు జిల్లా కేంద్రంలో తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్కను ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్ల సంఘం ఆధ్వర్యంలో గురువారం కలిశారు. ఈ సందర్భంగా వారు జిల్లా ప్రాజెక్టు మేనేజర్లకి పే స్కేలు అమలు చేసి ఈ పంచాయతీ కంప్యూటర్లకు, జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటర్స్ అనే హోదాను కల్పిస్తూ వారికి పే స్కేల్ అమలు చేసి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని మంత్రికి వినతిపత్రం అందజేశారు.