వెంకటాపూర్ మండలంలో విద్యుత్ ప్రజావాణి కార్యక్రమం

63చూసినవారు
వెంకటాపూర్ మండలంలో విద్యుత్ ప్రజావాణి కార్యక్రమం
ములుగు జిల్లా వెంకటాపూర్ మండల విద్యుత్ శాఖ సెక్షన్ ఆఫీసు ఆధ్వర్యంలో సోమవారం విద్యుత్ ప్రజావాణి కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా వెంకటాపూర్ మండల ఏఈ సురేష్, సబ్ ఇంజనీర్ సాంబ రాజు, ఎస్ఎల్ఐ ఉదయ భాస్కర్, ఎల్ఐ సమ్మి రెడ్డిలు ప్రజల నుండి వినతులు స్వీకరించారు. వారు మాట్లాడుతూ ప్రజావాణిలో విద్యుత్ సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో లైన్ మెన్ వేణు, జేఎల్ఎం లు తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్