ఏటూరునాగారంలో పోలీసుల విస్తృత తనిఖీలు

79చూసినవారు
ములుగు జిల్లా ఏటూరునాగారం ఏఎస్పీ ఆదేశాలమేరకు ఏటూరునాగారంలో ఆదివారం పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. వచ్చిపోయే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏటూరునాగారం ఎస్సై గుర్రం కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమనిబంధనలు పాటించాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్