సీడ్స్ షాపులపై కలెక్టర్ ప్రావీణ్య ఆకస్మిక తనిఖీలు

85చూసినవారు
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని పలు సీడ్స్ దుకాణాల్లో వరంగల్ జిల్లా కలెక్టర్ పీ. ప్రావీణ్య మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు విత్తనాలను పరిశీలించి వాటి ఎక్స్పయిరీ డేట్, వివిధ విషయాలు తెలుసుకున్నారు. నకిలీ విత్తనాలు అమ్మినా, కాలం చెల్లిన విత్తనాలు విక్రయించినా చట్టరిత్యా చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.