వరంగల్ జిల్లా నర్సంపేట శివారు కాకతీయ నగర్ సమీపంలోని సర్వే నెం 601 లోని ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించి ప్లాట్లు చేసి అమ్మేందుకు పావులు కదుపుతున్నారు. రొడ్డు కోసం మట్టి పోసి చదును చేశారు. ప్రభుత్వ భూమి కబ్జా అవుతున్న చూస్తున్న ప్రభుత్వాధికారులు, గతంలో బోర్డులు పాతిన అధికారులకు మళ్లీ రోడ్లు పోస్తుంటే కనిపించడం లేదా అంటూ స్థానికులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.