నేడు టీడీపీలో చేరనున్న మాజీ డిప్యూటీ సీఎం!

52చూసినవారు
నేడు టీడీపీలో చేరనున్న మాజీ డిప్యూటీ సీఎం!
AP: మాజీ డిప్యూటీ సీఎం, ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని టీడీపీలో చేరేందుకు లైన్ క్లియర్ అయింది. బుధవారం మధ్యాహ్నం అమరావతిలో సీఎం చంద్రబాబు సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. టీడీపీ అధిష్టానం సూచనల మేరకు ఆళ్ల నాని చేరికను తాను సమ్మతిస్తున్నట్లు ఏలూరు టీడీపీ ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. కాగా, రెండు నెలల క్రితం ఆళ్ల నాని వైసీపీకి, పార్టీ పదవులకు రాజీనామా చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్