నర్సంపేటలో పని చేయని సిసి కెమెరాలు

67చూసినవారు
నర్సంపేటలో పని చేయని సిసి కెమెరాలు
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ కేంద్రంలోని పలు ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయట్లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీని ద్వారా నగరంలో ఏదైనా ఘటనలు, గొడవలు, చోరీలతో పాటు ఇంకా ఏదైనా జరిగితే ఆధారాలు లేకుండా పోయే అవకాశాలు ఉన్నాయని చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకొని సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్