నల్లబెల్లి మండలంలోని వివిధ గ్రామాలలో పనిచేస్తున్న గ్రామీణ ఉపాధి హామీ కూలీల డబ్బులు గత రెండు నెలల నుండి రాకపోవడంతో చాలామంది ఉపాధి కూలీలు పస్తులు ఉండే పరిస్థితి నెలకొంది. కావున సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి గ్రామీణ ఉపాధి హామీ కూలీల డబ్బులు త్వరగా వారి వారి ఖాతాలో జమ చేయాల్సిందిగా ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నల్లబెల్లి ఎంపీడీవో విజయ్ కుమార్ ద్వారా జిల్లా కలెక్టర్ ని కోరారు. ఉపాధి కూలీ పడలేని పక్షాన గ్రామీణ ఉపాధి కూలీలు మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల మండల అధ్యక్షులు పులి రమేష్ గౌడ్, బొట్ల నరేష్, మార్తా నాగరాజు, నామాల సాంబయ్య, తదితరులు పాల్గొన్నారు.