నీట్ పరీక్ష రద్దు చేయాలని ఆందోళన

75చూసినవారు
నీట్ పరీక్ష రద్దు చేయాలని ఆందోళన
వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం, పట్టణంలో బీఆర్ఎస్ అనుబంధ విద్యార్థి సంఘం బీఆర్ఎస్వీ నాయకులు శనివారం ఆందోళన చేపట్టారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ విషయమై విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుపై కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని బీఆర్ఎస్వీ నర్సంపేట టౌన్ అధ్యక్షుడు దేవోజు హేమంత్ మండిపడ్డారు. ఆందోళనలో రవీందర్, వినయ్ భాస్కర్, తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్