శ్రీసోమేశ్వర ఆలయంలో వైభవంగా తొలి ఏకాదశి

60చూసినవారు
జనగాం జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని శ్రీ చండికా సమేత సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో తొలి ఏకాదశి వేడుకల్ని వైభవంగా నిర్వహించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. గురువారం ఉదయం వారు మాట్లాడుతూ తొలిఏకాదశి పర్వదినాన లోక కళ్యాణార్థమై మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, విశేష అలంకరణ, నీరాజనం, మంత్రపుష్పములు, తీర్థప్రసాదన వితరణను అత్యంత వైభవోపేతముగా నిర్వహించినట్లు వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్