ఇసుక సరఫరాని నిలిపివేసిన కలెక్టర్

84చూసినవారు
ఇసుక సరఫరాని నిలిపివేసిన కలెక్టర్
ప్రాజెక్టు నిర్మాణ పనులకు సేకరిస్తున్న ఇసుక తీతను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ప్రజలకు హామీ ఇచ్చారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని ప్రజావాణి కార్యక్రమంలో దేవరుప్పల మండల ప్రజలు ఇసుకతీతపై జిల్లా కలెక్టర్ కు ప్రజాప్రతినిధులతో కలిసి వచ్చి వినతిపత్రాన్ని అందించారు. దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా పాలకుర్తి రిజర్వాయర్ నిర్మాణానికి ఇసుకను వాడుతున్నారు.