పోలెపల్లి గ్రామానికి చెందిన పయ్యావుల యాకయ్య 10 రోజుల క్రితం అనారోగ్యంతో మరణించాడు. ఆదివారం దశదిన కర్మ సందర్బంగా మదర్ వాలంటరీ ఆర్గనైజేషన్ మండల కమిటీ ఆధ్వర్యంలో శనివారం యాకయ్య కుటుంబాన్ని పరామర్శించి సంస్థ ప్రతినిధి, జ్యోతిరావు పూలే నేషనల్ ఫెలోషిప్ అవార్డు గ్రహీత పయ్యావుల ప్రవీణ్ సహకారంతో 25 కిలోల బియ్యం అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ మండల కోశాధికారి షరీఫ్, సంస్థ ప్రతినిధులు కాసోజు రాజేష్, అనిల్ యాదవ్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.