పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని తొర్రూర్ కేంద్రంగా పని చేస్తున్న మూడు ఆగ్రోసు సెంటర్లు, ఒకటి పిఎసిఎస్ కి ప్రభుత్వం కేటాయించిన జీలుగ విత్తనాలను అధికారులు బ్లాక్ మార్కెట్ కు తరలించిన సంఘటనపై విజిలెన్స్ చే దర్యాప్తు చేపట్టాలని తోర్రూర్ జడ్పిటిసి సభ్యులు, మహబూబాబాద్ జిల్లా పరిషత్ ప్లోర్ లీడర్ మంగళంపల్లి. శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ ను కోరారు. మంగళవారం ఈ మేరకు ఆయన కలెక్టర్ లేఖ రాసారు.