యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శిగా తొర్రూరు పట్టణానికి చెందిన బాసనబోయిన వినోద్ కుమార్ ను నియమిస్తూ శుక్రవారం ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్ నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదవ హక్కుల సంక్షేమం, ఆశయాలు సాధన కోసం పాటుపడుతున్న వినోద్ కుమార్ సేవలను గుర్తించి నియమించినట్లు తెలిపారు. అనంతరం వినోద్ కుమార్ మాట్లాడుతూ తన నియామకంకు సహకరించిన జిల్లా, రాష్ట్ర, జాతీయ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.