వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద జిల్లా వ్యవసాయ అధికారి అనురాధతో కలిసి ఆదివారం గీసుగొండలో పాకనాటి సురేష్ వ్యవసాయ క్షేత్రంలో కంబైన్డ్ హార్వెస్టర్ తో కోస్తున్న వరి పంటను పరిశీలించారు. హార్వెస్టెర్ ద్వారానే రైతులు వరికోతలు చేస్తున్నందున హార్వెస్టర్ బ్లోయర్ స్పీడ్ 18-20 ఆర్పీ ఎమ్ ఉండే విధంగా చూసుకుంటే తాలు, చెత్త పోయి కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన వడ్లు వస్తాయని తద్వార రైతులకు మంచి ధర వస్తుందన్నారు.