

స్వయం సహాయక సంఘాలకు తొలి ప్రాధాన్యత: పరకాల ఎమ్మెల్యే
స్వయం సహాయక మహిళా సంఘాలకు ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. సోమవారం సంగెం మండలం నల్లబెల్లి గ్రామంలో సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి అధికారులతో కలిసి స్థల పరిశీలన చేశారు. స్వయం సహాయక సంఘాలకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ భూములలో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు స్థలాన్ని ఎంపిక చేస్తున్నామన్నారు.