హనుమకొండ, భవాని నగర్ లోని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి నివాసంలో ఆదివారం మహాపడిపూజను వైభవంగా నిర్వహించారు. బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుస్వామి చే అయ్యప్ప స్వామి మహాపడి పూజను భక్తిశ్రద్ధలతో జరిపారు. స్వామియే శరణమయ్యప్ప అంటూ భక్తుల శరణు ఘోషతో ఆ ప్రాంతం మారుమోగింది ఇనుగుర్తి మధు అయ్యప్ప కళాబృందం అయ్యప్పమాలధారులు ఆలపించిన అయ్యప్ప పాటలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి.