పరకాల హరిహర పుత్ర అయ్యప్ప క్షేత్రంలో మహా పడిపూజ అంగరంగ వైభవంగా పెద్దకోడపాక గ్రామానికి చెందిన సూర్యదేవర వీరన్న ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు, గురుస్వామి మాణిక్యం బాబురావు సోమవారం ఘనంగా నిర్వహించారు. హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో పడిపూజ నిర్వహించగా శాయంపేట, నడికూడ, పరకాల, రేగొండ, హనుమకొండ నుండి భారీగా అయ్యప్ప మాలధారణ స్వాములు ఆలయాన్ని చేరుకొని మహా పడిపూజలో పాల్గొన్నారు.