మనస్థాపానికి గురై వృద్ధురాలు ఆత్మహత్య

57చూసినవారు
మనస్థాపానికి గురై వృద్ధురాలు ఆత్మహత్య
క్యాన్సర్ వ్యాధిని భరించలేక ఓ వృద్ధురాలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రఘునాథపల్లి మండలం ఫతేశాపురంలో చోటు చేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం చీరబోయిన సత్తమ్మ(75)ఆరు నెలలుగా కాన్సర్ వ్యాధితో బాధపడుతుంది. ఆదివారం మనస్థాపానికి గురై గ్రామ శివారులోని ఓ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు మృతదేహాన్ని బయటికి తీయించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్