వరంగల్ నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది: ఎంపీ కావ్య
హన్మకొండ రాయపురలో నూతనంగా ఏర్పాటు చేసిన జ్యువెలర్స్ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆదివారం వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ముఖ్య అతిథిగా హాజరయి ప్రారంభించారు. వ్యాపార రంగంలో హైదరాబాద్ తరువాత వరంగల్ నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఇలాంటి వ్యాపార సంస్థల ఏర్పాటుతో ఎంతో మంది స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు.