హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో డిఆర్డిఎ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సోమవారం పరిశీలించారు. సన్న, దొడ్డు రకం ధాన్యాలు కొనుగోలుకు ఏర్పాటుచేసిన రెండు కేంద్రాలను పరిశీలించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో మాట్లాడుతూ రైతులకు సరిపోను బస్తాలు అందుబాటులో ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.