ధర్మసాగర్ మండలం క్యాతంపల్లి గ్రామానికి చెందిన మోడం రమేష్(36) కూలిగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నిత్యం తాగి వచ్చి భార్య పిల్లలను కొట్టేవాడు. ఆదివారం రాత్రి తవచ్చిన ఆయన భార్య స్వాతితో గొడవపడ్డాడు. దీంతో భార్య స్వాతి వారి అత్తతో కలిసి కర్రతో రమేష్ తలపై బలంగా కొట్టారు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.