
తాడ్వాయి: భర్త పెద్ద కర్మ రోజే భార్య మృతి
తాడ్వాయి మండల కేంద్రంలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన బుర్ర నర్సయ్య అనే గీత కార్మికుడు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. శనివారం ఆయన పెద్ద కర్మ జరగగా ఆదివారం తెల్లవారుజామున ఆయన భార్య బుర్ర వీరలక్ష్మి మృతి చెందింది. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.