ప్రమాణ స్వీకారం చేయకుండానే వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పదవిని నిరాకరించిన సంఘటన జనగాం జిల్లా స్టేషన్ ఘనపూర్ లో చోటుచేసుకుంది. చైర్మన్ పదవిని ఆశించిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు కాసాని బొందయ్య డైరెక్టర్ పదవి రావడం, కనీసం వైస్ చైర్మన్ కూడా రాలేదనే అసహనంతో డైరెక్టర్ పదవిని నిరాకరిస్తున్నట్లు మార్కెట్ కార్యదర్శికి లిఖితపూర్వకంగా సమాచారాన్ని అందించగా విషయాన్ని పై అధికారులకు తెలియచేయనున్నట్లు తెలిపారు.