ఆగివున్న లారీ ఢీకొన్న ఘటనలో పాప మృతి

554చూసినవారు
ఆత్మకూరు మండలం గుడెప్పాడ్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడం తో మూడు నెలల పాప మృతి చెందింది. అలేరుకు చెందిన ఎలగందుల స్రవంతి శ్రీకాంత్ దంపతులు మల్లూరుకు వెళ్లి కారులో తిరుగు వస్తుండగా ఈ ఘటన జరిగింది. దంపతులకు తీవ్ర గాయాలు కాగా వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. స్రవంతి పరిస్థితి విషమంగా ఉండటంతో శుక్రవారం ఉదయం హైదరాబాద్ కి తరలించారు.