వరంగల్ లో భారీగా గుట్కాల పట్టివేత

59చూసినవారు
వరంగల్ ఇంతెజార్గంజ్ పోలీసు స్టేషన్ పరిధిలోని ప్రాంతంలో బుధవారం తనిఖీ చేసి గుట్కాలు పట్టుకున్నట్లు టాస్క్ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు. ఎల్బీ నగర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఫజల్ గోదాంలో రూ. 4, 82, 872 విలువ గల గుట్కాలు, అంబర్ ప్యాకెట్లను స్వాధీనపర్చుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసినట్లు ఏసీపీ తెలిపారు. ఈ తనిఖీలో సీఐ బాబులాల్, ఎస్సై వెంకన్న, టాస్క్ఫోర్స్ పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :