వరంగల్ లో భారీ వర్షం

10118చూసినవారు
వరంగల్ నగరంలో శనివారం ఉదయం నుండి ఆకాశం మబ్బులతో ఉండడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం మొదలైంది. ఇన్ని రోజులు భానుడి ప్రతాపానికి గురై, ఎండలతో అధిక వేడితో నగర ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై చిరుజల్లు కురుస్తుండడంతో ఉక్కపోతతో అల్లాడిపోయిన జనం వేడి నుండి ఉపశమనం పొందుతున్నారు.