మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో 12 న ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన నేపద్యంలో పట్టణంలోని బంధం రోడ్డు , నూతన కలెక్టర్ కార్యాలయంలో జరుగుతున్న రోడ్డు పనులను మంగళవారం మహబూబాబాద్ జిల్లా ఎమ్మెల్యే బాణోత్ శంకర్ నాయక్ పరిశీలించారు. ఎమ్మెల్యే అధికారులకు పలు సూచనలు, సలహాలు చేశారు. కార్యక్రమం లో మున్సిపల్ చైర్మన్ డా. పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ MD. ఫరీద్, మార్నేని వెంకన్న, యాళ్ల మురళీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.