తూర్పుకోటలో ఘనంగా పెద్దమ్మతల్లి జాతర

70చూసినవారు
తూర్పుకోటలో ఘనంగా పెద్దమ్మతల్లి జాతర
ఉగాది పండుగ సందర్భంగా ఖిలవరంగల్ తూర్పుకోటలో పెద్దమ్మతల్లి జాతర మంగళవారం రాత్రి ఘనంగా జరిగింది. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఖిలావరంగల్ తోపాటు స్థంభంపెల్లి, వసంత పురం, దూపకుంట, వంచనగిరి, గీసుగొండ, తదితర ప్రాంతాలనుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి పూజలు చేశారు. వ్యవసాయదారులు, స్థానిక ప్రజలు ఎడ్లబండ్లు, బైక్ లు, ఆటోలు, కార్లు, ట్రాక్టర్లపై వచ్చి దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్