కాంట్రాక్టర్ పై కేసు నమోదు

573చూసినవారు
వరంగల్ పాత బస్టాండ్ లో వాటర్ ట్యాంక్ తొలగించే క్రమంలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన తెలిసిందే. బస్టాండ్ ఆవరణలో ఉన్న వాటర్ ట్యాంక్ ను తొలగిస్తున్న క్రమంలో ఒక్కసారిగా కుప్పకూలడంతో అందులో పని చేస్తున్న బొంత రవి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. రవి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గురువారం వరంగల్ ఎసిపి నందిరాం నాయక్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్